ఒన్ టైం సెటిల్మెంట్ స్కీం పై ధ్వజమెత్తిన కీర్తన

ప్రజలపై భారం మోపని ఆదాయ మార్గాలు అన్వేషించండి. అంతే కానీ రాష్ట్ర ఖజానాని ప్రజల కష్టం ద్వారా నింపే ప్రయత్నం మానుకోండి.

చిత్తూరు జిల్లా, జగనన్న ఒన్ టైం సెటిల్మెంట్ స్కీం… ఎప్పుడో 1983లో కట్టిన ఇళ్ళకి ఇపుడు పట్ట్ కల్పిస్తామని, దానికిగాను గ్రామాల్లొ ఐతే 10000, పంచాయతీల్లో 15000 అదే కార్పొరేషన్లో ఐతే 20000 తీసుకుంటున్నామని ప్రజలకు ఇష్టపూర్వకమైతేనే పట్టా తీసుకోండి బలవంతం చేయట్లేదని ప్రభుత్వం అంటోంది. కానీ గ్రౌండ్ రియాలిటీ ఎమిటంటె అధికారులు వాలంటీర్లకు రోజుకు 4 నుండి 10 వరకు చేయాలని టార్గెట్ ఇచ్చి ఒకవేళ ప్రజలు చేయించుకోము అంటే వాళ్ళకి రావలసిన పధకాలు పెన్షన్ లు తీసేస్తామని లేదా వారి పొదుపు డబ్బు ఇవ్వమని చెప్పడం మనం ఆడియోలు వింటూ, వీడియోల్లో చూస్తూ ఉన్నాం. అదే ప్రచారంగా ప్రజల్లో వ్యతిరేకత కూడా వస్తుంది ప్రభుత్వం చెప్పే మాటలకి, క్షేత్ర స్థాయిలో జరుగుతున్నదానికి చాలా వ్యత్యాసం ఉంది. రాష్ట్ర ఖజానాలో దబ్బులు లేకపోవడం వల్ల, ప్రజలపై పన్నుల భారం మోపి ట్రుఆప్ చార్జీలని, ఇలా ఒన్ టైం సెట్టిల్మెంట్ అని ప్రజల నుండి ప్రభుత్వం తీసుకుంటోంది తప్ప ఆదాయ వనరులను పెంచి తద్వారవ రాష్ట్ర ఖజానను పెంచే ఆలోచనైతే చేయడం లేదు. ప్రభుత్వం వెంటనే ఇపుడున్న సలహాదారులను మార్చి కొత్తవారిని తీసుకోవాలని, ఎందుకంటే ఇపుడున్న సలహాదారులు ప్రజలను పిండి వచ్చే ఆదాయంతో ప్రభుత్వాన్ని నడిపించాలని సలహాలిస్తున్నారే తప్ప రాష్ట్రానికి కొత్త కంపెనీలను తీసుకువచ్చి తద్వారా యువతకు ఉపాధిని కల్పించి ఆదాయలను పెంచే సలహాలైతే ఎవరు ఇవ్వడం లేదని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రెటరి కీర్తన ప్రభుత్వం పై ధ్వజమెత్తారు.