ఘనంగా కేశవబట్ల విజయ్ జన్మదిన వేడుకలు

తాడేపల్లిగూడెం: బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘ నియోజకవర్గ అద్యక్షులు మరియు జనసేన జిల్లా కార్యదర్శి కేశవబట్ల విజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో బీసీ నాయకుల మధ్య కేక్ కటింగ్ జరిగింది. అనంతరం నియోజక వర్గ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మారిసెట్టి నరసింహ మూర్తి ఆధ్వర్యంలో స్థానిక ఏరియా ఆస్పత్రిలో ప్రసూతి వార్డులో పౌష్ఠిక ఆహారం వితరణ చేశారు. అనంతరం నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి తుమరాడ చిన్న ఆధ్వర్యంలో ప్రేమాలయం వద్ద యాచకులకు బిర్యానీ పొట్లాలు వితరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వర్తనపల్లి కాశీ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో బీసీ సంఘం అభివృద్ధికి బీసీల తరుపున పోరాటానికి ముందు వరుసలో వుండే నాయకుడు విజయ్ అని, బీసీల కులగణన చేపట్టాలని, బీసీ సంఘం చేసిన పోరాటంలో మరియు కాపులను బీసీ లలో చేర్చే మంజునాథ కమిషన్ ని వ్యతిరేఖంగా విజయ్ పనితీరుని ప్రశంసించి బీసీ సంఘంలో విజయ్ నీ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. తుమరాడ చిన్న మాట్లాడుతు మహాత్మా జ్యోతిరావు పూలే భావజాలాన్ని యువతకి చేరవేయడంలో మరియు, బీసీల హక్కుల కార్యాచరణకు, మండల కమిషన్ సిఫార్సుల సాధనకు విజయ్ చేసే పోరాటం ప్రశంసనీయం అని అంతేకాకుండా నియోజక వర్గంలోని ప్రతి పల్లెలో బీసీల జెండా ఎగురవేయుటకు స్థానిక బీసీ నాయకులలో అవగాహన కల్పించడం మరియు రాజ్యాధికారం సాధించేలా బీసీలని సమాయత్తం చెయ్యడంలో అతను చూపించే పనితీరు అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వక్తలు పెంటపాడు మండల అధ్యక్షులు మల్లేశ్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు మారిసేట్టి నరసింహ మూర్తి, నియోజకవర్గ కార్యదర్శి చొప్ప లక్ష్మణ్, మరియు అప్పు, మరియు బెనర్జీ విజయ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. అతను మరిన్ని పదవులు చేపట్టాలి అని పులే ఆశయ సాధన దిశగా పయనించే దిశగా ఆ భగవంతుడు ఆశీస్సులు వుండాలి అని దీవించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు సోము బాబు, ముకేష్, రామకృష్ణ, వెంకటేష్, పి. సత్యనారాయణ పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2023-05-16-at-8.26.52-PM-1024x580.jpeg