ఖబడ్దార్ సిపిఐ నారాయణ: మాదాసు నరసింహ

  • కడప జిల్లా చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు మాదాసు నరసింహ

అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. సీపిఐ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారాయణ డాక్టర్ పద్మభూషణ్ కొణిదెల చిరంజీవి పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ.. కడప జిల్లా చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు మాదాసు నరసింహ మాట్లాడుతూ

మెగా అభిమానుల ఆరాధ్య దైవం శ్రీ పద్మభూషణ్ చిరంజీవి అన్నయ్య గారి పైన మీరు చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు

నీలాగా విద్యార్థులను అడ్డుపెట్టుకొని ఆయన చిల్లర రాజకీయాలు చేయలేదు

నీకు వయసు పెరిగి, బుద్ది మందగించి అతి మాటలు మాట్లాడడం సరైన పద్దతి కాదు.

అయినా ఆ కార్యక్రమానికి ఎవరిని పిలవాలి అనేది పి.ఎం.ఓ కార్యాలయం నిర్ణయిస్తుంది.. అది చెప్పడానికి నువ్వు ఎవరు..?

నేడు ఎంతో మంది కార్మికులకు అండగా నిలిచిన, గొప్ప గొప్ప మహా నాయకులు ఉన్న సిపిఐ పార్టీ లో నీలాంటి అవిశ్వాస పరుడు ఉండడం సిగ్గుచేటు.

నీ రాజకీయ లబ్ది కోసం మా అన్నయ్యను అవమాన పరిచేలా నువ్వు మాట్లాడిన మాటలను వెనక్కు తీస్కో.

ఉమ్మడి కడప జిల్లా నుంచి ఒక మెగా అభిమానిగా నేను నీకు చెప్పేది ఒక్కటే అన్నయ్య కి భేషరతుగా క్షమాపణ చెప్పి నీ పెద్దరికాన్ని నిలబెట్టు కోవాలి అని మాదాసు నరసింహ హెచ్చరించారు.