వ్యక్తిగత కక్షలకు ప్రేరేపిస్తే ఖబర్ధార్ జగన్ రెడ్డి: కొండిశెట్టి

  • జనసేన నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్

నార్పల: అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహారిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జనసేనపార్టీ శింగనమల నియోజకవర్గ నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ కి నిరసనగా తెదేపా రాష్ట్ర బంద్ కార్యక్రమానికి జనసేనపార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. జనసేన నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో తెదేపాకు మద్దతు తెలపడానికి వెళ్తున్న జనసేన నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించారు. ఈ సందర్బంగా కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి పట్టం కడితే తాను అధికారంలోకి వచ్చినప్పటి నుండి నియంతలా వ్యవహారిస్తూ వ్యక్తిగత కక్షతో ప్రతి పక్షాలను అణిచివేతకు గురి చేస్తున్నాడని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన వ్యవహార శైలి మార్చుకోకపోతే జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుపాకుల భాస్కర్, కలవాయి విశ్వనాథ్ రెడ్డి, రహమతుల్లా, సంగా అశోక్, పొన్నతోట రామయ్య, అమీర్ ఖాన్, రామకృష్ణ, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.