తెలుగుదేశం రాష్ట్ర బంద్ కు రాజమహేంద్రవరం సిటీ జనసేన మద్దతు

రాజమహేంద్రవరం సిటి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు, పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు రాజమహేంద్రవరం సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆదేశాలతో రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు తెలుగుదేశం పార్టీ తలపెట్టిన రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ మద్దతు ఇస్తూ రాజమండ్రి పరిసరాల ప్రాంతాలు అనగా దానివైపేట, దేవిచౌక్, కంబాలచెరువు, మెయిన్ రోడ్డు, వి ఎల్ పురం సెంటర్, స్టేడియం రోడ్, సాయి కృష్ణ థియేటర్ మీదుగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అనుశ్రీ మాట్లాడుతూ గత రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలను కాపాడవలసిన పోలీసు వ్యవస్థ కేవలం ప్రతిపక్ష నాయకులను నిర్బంధించడానికే పరిమితమైందని విమర్శించారు. ప్రజాస్వామ్య బద్దంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష పార్టీలకు ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రహించాలని హితవుపలికారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన విధానం సరికాదన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత స్వేచ్ఛను, సామాజిక బాధ్యతను అడ్డుకునే హక్కు పోలీసులకు లేదని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పినందుకే వైసిపి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన రాష్ట్ర బందుకు మద్దతు తెలపడం జరిగిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని బలపరచడం ద్వారా ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సాగనంపాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ వైవిడి ప్రసాద్, ప్రధాన కార్యదర్శులు పైడిరాజు, నల్లంశెట్టి వీరబాబు సిటీ కార్యదర్శులు అల్లాటి రాజు, గుణ్ణం శ్యాంసుందర్, విన్న వాసు సంయుక్త కార్యదర్శి దేవకివాడి చక్రపాణి, జనసేన యువ నాయకులు బయ్యపునీడి సూర్య నగర జనసేన నాయకులు విక్టరీ వాసు, మానే ఆదిబాబు, మాస నాని, మణికంఠ, బత్తిన సత్యనారాయణ మరియు జనసైనికులు పాల్గొన్నారు.