సత్యవేడు జనసేన సమన్వయ ఇంచార్జ్ గా కొప్పల లావణ్యకుమార్

సత్యవేడు నియోజకవర్గం: జనసేన పార్టీ సమన్వయ ఇంచార్జ్ గా కొప్పల లావణ్యకుమార్ ని అధిష్టానం నియమించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శిగా ఉన్న లావణ్యకుమార్ జనసేన పార్టీ స్తాపించినప్పటి నుండి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, కార్యకర్తలకు అందుబాటులో ఉండడంతో అధినేత పవన్ కళ్యాణ్ సమన్వయ ఇంచార్జ్ గా నియమించడం జరిగింది. లావణ్యకుమార్ మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా:పసుపులేటి హరిప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసారు. నియోజకవర్గంలో అందరిని కలుపుకొని క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసి, ప్రజా సమస్యల మీద పోరాడతామని తెలిపారు.