కోటా చంద్రబాబు రిమాండ్ అప్రజాస్వామికం

శ్రీకాళహస్తి నియోజకవర్గం: చిందేపల్లి గ్రామం రోడ్డు సమస్య కోసం పోరాటం చేసిన కోటా చంద్రబాబుపై పోలీసులు పెట్టిన అక్రమ కేసుల్లో భాగంగా గురువారం హైకోర్టు వాయిదా నిమిత్తం విజయవాడ వెళ్లిన కోటా చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి విజయవాడ నుండి శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు ఆయనను శుక్రవారం శ్రీకాళహస్తి సబ్ జైల్ నందు 14 రోజుల పాటు రిమాండ్ కు తరలించారు. కోటా చంద్రబాబు రిమాండ్ అప్రజాస్వామికం అని జనసేన తరఫున నాయకులు పేర్కొన్నారు.