వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరిన కొత్తపాకలు గ్రామం

పాడేరు: సోమవారం చింతపల్లి మండలంలోతుగెడ్డ పంచాయితీ కొత్తపాకలు గ్రామంలో స్థానిక గ్రామస్తుల సమావేశానికి జనసేన పార్టీ నాయకులు ముఖ్య అతిథిగా డా.వంపూరు గంగులయ్య హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అనేక రకమైన మోసాలు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంచేస్తుందని, మన యువతకు ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేసిన జీవో నెం3 రద్దు చేయడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని, 34 ఉపకులలాలు వేరు వేరు భాషలు కలిగిన ప్రజలకు వారి పిల్లలకు విద్యనందించేందుకు వారి భాషతోనే విద్యాబోధన అందుకు భాష వలంటీర్ల రద్దు, అన్ని రంగాల్లో వెనకబాటుకి గురౌతున్న గిరిజనుకు గుది బండలాగా చాలదన్నట్లు బీసీ కులాలను ఎస్టీ జాబితాలో కలిపేందుకు కుటిల రాజకీయ స్వార్ధ ప్రయత్నాలు ఇంకా గిరిజనులకు చేయుతనిచ్చే సుమారు 18 పథకాలు నిలుపుదల చేసిందని ఇప్పటికైనా ప్రభుత్వం చేసే ఆగడాలు మనం ఎదుర్కొనకపోతే మన మనుగడ కష్టమే అన్నారు ఇవ్వాళ నియోజకవర్గ పరిధిలో విద్యావంతులైన యువకులు నేడు నియోజకవర్గంలో అనేక గ్రామాలను తిరుగుతూ మన గిరిజన ప్రజలకు రాజకీయ చైతన్యం కలిగిస్తున్నారని గిరిజన ప్రాంతంలో మార్పుకోసం జనసేనపార్టీ ద్వారా ఎంతో కృషి చేస్తున్నామని మీరంతా తోడ్పాటునివ్వాలన్నారు ఈ సందర్బంగా జనసేనపార్టీ లక్ష్యాలు, సిద్ధాంతాలకు, ఆకర్షితులై గ్రామస్తులు జనసేనపార్టీ లో చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి జనసేనపార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సమావేశానికి చేరికలకు కృషి చేసిన వంతల రాజారావు, శేఖర్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అల్లూరిజిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ఉల్లి సీతారామ్, చింతపల్లి మండల అధ్యక్షులు వంతల బుజ్జిబాబు, శెట్టి స్వామి, శ్రీను, కూడా అబ్బాయిదొర, అశోక్ తదితర జనసైనికులు, గ్రామయువత పాల్గొన్నారు.