కొయ్యలగూడెంలో జనసేన మండల కమిటీల సమావేశం

పోలవరం: కొయ్యలగూడెం మండల కేంద్రంలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షులు తోట రవి ఆధ్వర్యంలో మండల కమిటీ గ్రామ కమిటీ మరియు క్రియాశీలక వాలంటీర్లు, పార్టీ యాక్టివ్ పీపుల్స్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేసంలో పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి చిర్రి బాలరాజు పాల్గొన్నారు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మండల స్థాయి గ్రామస్థాయిలో పార్టీ యొక్క బలోపేతం కోసం చేయవలసినటువంటి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, లీగల్ సెల్ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు క్రియశీలక వాలంటీర్స్ పాల్గొన్నారు.