నామినేషన్ ను విజయం చేసినందుకు కృతజ్ఞతలు: బొమ్మిడి నాయకర్

నరసాపురం నియోజకవర్గంలో జరిగిన వారాహీ విజయ భేరి, భారీ బహిరంగ సభను అలాగే నామినేషన్ సందర్భంగా నరసాపురం జనసేన పార్టీ కార్యాలయం దగ్గరి నుంచి సబ్ కలెక్టర్ వారి కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ ను ఇంతటి ఘన విజయం చేసి మీ ఆశీర్వాదాలు అందజేసిన ప్రతీ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులకు, వీరమహిళలకు అలాగే నియోజకవర్గ ప్రజానీకం అందరికీ ఒక ప్రకటన ద్వారా మనః పూర్వక ధన్యవాదాలు తెలియజేసిన టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్.