జనసేన నాయకులపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలి: మదనపల్లి జనసేన

  • నల్ల రిబ్బన్లు ధరించి నిరసన

మదనపల్లి, అంబోతు అంబటి రాంబాబు, గట్కా కొడాలి నాని, జిల్లా మంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుతో తలదించుకునే రోజాలు నోరు అదుపులో పెట్టుకోవాలని, జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు ఎంతో సహనంతో ఉంటే అనవసరంగా రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి సూచించారు. విశాఖపట్నంలో జనసేన పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం చిత్తూరు బస్టాండు సర్కిల్ వద్ద జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి ఆద్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి అడపా సురేంద్ర, కార్యదర్శి సనావుల్లా, రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, ఉపాధ్యక్షుడు లక్ష్మీపతి, రూరల్ ప్రదాన కార్యదర్శి గండికోట లోకేష్, ఐటి విభాగం జగదీశ్, రాజేష్, వీర మహిళలు రెడ్డెమ్మ, పద్మావతి, కోలా నాగవేణి, నౌషద్, సయ్యద్ ఆర్.సి, కార్తీక్, ఆకాష్ పాల్గొన్నారు. ‌ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో పెట్టుకోవడం ప్రభూత్వ పతనానికి నాంది అన్నారు. అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు అమరావతి నుండి అరసవల్లి వరకు చేసే పాదయాత్రను అడుగడుగునా ఆటంకాలు కల్పించడం ప్రభుత్వం నీతి బాహ్యమైన చర్య అన్నారు. జనసేన పార్టీ నాయకులు జనవాణి కార్యక్రమం ‌ముందుగానే అనుమతి తీసుకున్నా పోలీసులు ఆంక్షలు విధించడం, అక్రమంగా కేసులు నమోదు చేయడం దారుణం అన్నారు. పవన్ కళ్యాణ్ ను హోటల్ నుండి రాకుండా అడ్డుకోవడం పోలీసులు తీరు విస్మయం కలిగించిందన్నారు.‌ జనసేన పార్టీ నాయకులు, జనసైనికుల మీద పెట్టిన కేసులను ఉపసంహరించాలని, బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‌ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికుల, వీర మహిళలు పాల్గొన్నారు.