తాడిపత్రిలో మినీ థియేటర్ ప్రారంభం

తాడిపత్రి నియోజక వర్గ జనసేన పార్టీ ఇంఛార్జి కదిరి శ్రీకాంత్ రెడ్డి తన మినీ సినిమా థియేటర్ ను జనసైనికుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసైనికులు పాల్గొని కదిరి శ్రీకాంత్ రెడ్డి కి శుభాభినందనలు తెలియజేశారు. థియేటర్ ప్రారంభం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రాన్ని ప్రదర్శించారు. తరువాత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని ప్రదర్శించడం జరిగింది.