చలో తాడేపల్లిగూడెం పోస్టర్ల ఆవిష్కరణ
నందిగామ నియోజకవర్గం: నందిగామ జనసేన పార్టీ కార్యాలయం నందు మంగళవారం టిడిపి జనసేన నందిగామ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య మరియు నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి తెలుగు జన విజయకేతనం జెండా చలో తాడేపల్లిగూడెం కార్యక్రమం యొక్క పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. బుధవారం జరగబోవు తాడేపల్లిగూడెం భారీ బహిరంగ సభకు ఇరు పార్టీల కార్యకర్తలను సమన్వయపరిచి సభకు పాల్గొనేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చించారు, రాబోవు 2024 ఎన్నికలకు ఇరు పార్టీల శ్రేణులను సమన్వయపరిచి ఉమ్మడి అభ్యర్థి యొక్క విజయమే లక్ష్యంగా పని చెయ్యాలని వారితో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా తంబళ్లపల్లి రమాదేవి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రజలందరూ వైసిపి విముక్త ఆంధ్ర ప్రదేశ్ ని కోరుకుంటున్నారనీ, ప్రజా క్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అధికార పార్టీ ఓటు చేయలనివ్వని అనే నినాదంతో టిడిపి పార్టీతో పొత్తు పెట్టుకుని జనసేన పార్టీ వాళ్ళందరము పొత్తు ధర్మం పాటిస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలో జరగబోవు భారీ బహిరంగ సభకు నందిగామ నియోజకవర్గం నుండి ఇరు పార్టీ శ్రేణులను కలుపుకొని వెళ్ళి సభను విజయవంతం చేసే దిశగా ఈరోజు అందరూ కలిసి చర్చించాము. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపి ప్రభుత్వాన్ని స్థాపిస్తాం అని రమాదేవి అన్నారు. ఈ కార్యక్రమానికి నందిగామ నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.