టీమ్ సైనిక మరియు యూఏఈ జనసేన ఆధ్వర్యంలో జనసేన కేలండర్ల ఆవిష్కరణ

జనసేన పార్టీ టీం సైనిక & జనసేన యుఏఈ టీం సంయుక్త ఆధ్వర్యంలో జనసేన పార్టీ సింద్దాంతాలు వ్యూహలు, సేవలు, పోరాటాలు, లక్ష్యాలు గల కేలండర్ల ను జనసేన పార్టీ పెన్నా కృష్ణా రీజనల్ కోర్దినేటర్ శ్రీమతి కోలా విజయలక్ష్మి చేతులు మీదుగా ఆవిష్కరించారు. అనంతరం కోలా విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 20వేల క్యాలెండర్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఎన్.ఆర్.ఐ లుగా ఉంటూ ఇరు తెలుగు రాష్ట్రాల జనసైనికులను, వీరమహిళలను కలుపుకొని పార్టీకి తమ సేవలు అందిస్తున్న టీం సైనిక ఫౌండర్ అమీర్ ఖాన్ కు జనసేనపార్టీ యుఏఈ లీడర్ అప్పారావు కు అమె ధన్యవాదాలు తెలిపారు. అలాగే కార్యకర్తలకు క్యాలెండర్లు అందచేసేందుకు సహకరించిన టీం సైనిక & యుఏఈ టీం సభ్యులు అందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరమహిళలు లక్ష్మీ, రేవతి, కోండాపురం కస్తూరి, రాధమ్మ, ప్రవళ్లిక పాల్గొన్నారు.