ఎమ్మిగనూరులో రెండవ విడత క్రియాశీలక సభ్యత్వం ప్రారంభం

ఎమ్మిగనూరు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మరియు నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ గౌడ్ ఆదేశాల మేరకు స్థానిక పార్టీ కార్యాలయం నందు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చేనేత రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్ కరణం రవి మాట్లాడుతూ దేశంలో ఏ పార్టీ తన కార్యకర్తలకు ఇవ్వలేని భరోసా ఇచ్చిన ఏకైక పార్టీ జనసేన మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలాంటి సువర్ణ అవకాశాన్ని ప్రతి యొక్క అభిమాని కార్యకర్త సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు పోయి 2024లో పార్టీ గెలుపుకి ప్రతి ఒక్క జనసేన నాయకులు జనసైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రమేష్ కాశీం మునిస్వామి రషీద్ తదితరులు పాల్గొన్నారు.