బీజేపీని వీడి జనసేనలోకి

ఖమ్మం నియోజకవర్గం: ఎర్రుపాలెం మండల జనసేన కేంద్రాలయంలో ప్రముఖ నాయకులు బీజేపీ కిసాన్ మోర్చా ఎర్రుపాలెం మండల మాజీ అధ్యక్షుడు, బనిగండ్లపాడు శక్తికేంద్ర ఇంచార్జి మిర్యాల నాగేశ్వరరావు బీజేపీ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నేమూరి శంకర్ గౌడ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రాము తాళ్లూరి సూచన సలహాలతో మిరియాల నాగేశ్వరావు కు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీ మధిర నియోజకవర్గం నాయకులు తాళ్లూరి డేవిడ్, పగడాల రామారావు, ముదిగొండ మండల నాయకులు మిట్టపల్లి రామారావు, ముదిగొండ మండల అధ్యక్షులు జొన్నలగడ్డ భద్ర సాధనంగా ఆహ్వానించారు. ఈ సందర్భం తాళ్లూరి డేవిడ్ తోపాటు పగడాల రామారావు మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారి సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరిన మిర్యాల నాగేశ్వరావు గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో పెద్దలు మరియు యువత జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మధిర నియోజకవర్గంలో ఐదు మండలాలో జనసేన పార్టీలో చేరడానికి పార్టీలో పని చేయడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. 2024లో మధిర గడ్డమీద జనసేన జెండా ఎగరావేయటానికి మధిర నియోజకవర్గ జనసైనికులు అందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీలో చేరే ప్రతీ ఒక్క కార్యకర్తకి, నాయకులకి పార్టీ అండగా ఉంటుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జానీపాషా, రామారావు, నాగేశ్వరావు, ప్రవీణ్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.