రోడ్ల దుస్థితి ప్రభుత్వానికి తెలిజేసెలా.. గుడ్ మార్నింగ్ సీఎం సార్ క్యాంపెయిన్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు #GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా తూర్పు నియోజకవర్గం, 7వ డివిజన్ లో దయనీయ రోడ్ల పరిస్థితి పై 7వ డివిజన్ అధ్యక్షురాలు శ్రీమతి దోమకొండ మేరి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కమిటీ సభ్యులు, జనసైనికులు పాల్గొని నిరసన తెలియజేయడం జరిగింది.