యువశక్తి తో జనసేన సత్తా చాటుదాం.. వైఎస్సార్సీపీ నాయకులను ఇంటికి పంపుదాం: పితాని బాలకృష్ణ

విజయనగరం: రణస్థలంలో జనవరి 12న జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యువశక్తి సభను విజయంతం దిశగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే కార్యక్రమంలో భాగంగా జనసేనపార్టీ నాయకులు గురాన అయ్యలు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం హోటల్ జి.ఎస్.ఆర్.లో ఉన్న కార్యాలయంలో యువతతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యువశక్తి కార్యక్రమానికి జిల్లాకు వచ్చిన యువశక్తి ప్రచారకర్తలుగా పితాని బాలకృష్ణ, బొలిసెట్టి శ్రీనివాస్, హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు పితాని బాలకృష్ణ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర యువత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు కూలీల్లా వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు ఉన్నా వెనుకుబాటుతనం పోగొట్టడానికి, యువతలో చైతన్యం తెచ్చేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ యువశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. మరో నాయకులు బొలిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర లో ఉన్న వైఎస్ఆర్సీపీ మంత్రులు, నాయకులు బాగుపడ్డారే తప్పా ప్రజలను, యువతీ యువకులను గాలికొదిలేసారని వాపోయారు. రాష్ట్ర ప్రధనకార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి మాట్లాడుతూ గత, ప్రస్తుత పాలకులు యువతీ యువకుల పట్ల ఉపాధిని కల్పించటంలో నిర్లక్ష్యం వహించారని, దేశానికి వెన్నుముక యువత ఐనా వారి శక్తిసామర్థ్యాలను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. సమావేశం నిర్వాహకులు, జనసేన నాయకులు గురాన అయ్యలు మాట్లాడుతూ యువశక్తి కి పార్టీ పెద్దల సలహాలు, సూచనలు మేరకు యువశక్తి ప్రచారంలో భాగంగా కళాశాలలకు వెళ్లి విద్యార్థులతో సమావేశాలు జరిపి, యువశక్తి గోడ పత్రికలను, అంటించే పత్రికలను, కరపత్రాలను పంచి పట్టణంలోను, గ్రామాల్లోనూ బాగా అవగాహన కల్పించామని, జనవరి 12న జరుగు యువశక్తి సభకు భారీగా తరలి వెళ్తామని తెలిపారు. యువశక్తి కార్యక్రమానికి భారీ ఎత్తున తరలి రావాలని యువశక్తి తో జనసేన పార్టీ సత్తాచాటి, వైఎ్సార్సీపీ నాయకులను ఇంటికి పంపి బుద్ది చెప్పాలని జనసేన నాయకులంతా ముక్త కంఠంతో ద్వజమెత్తారు. జనసేన నాయకులు ఆదాడ మోహనరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జనసేన నాయుకురాలు లోకం మాధవి, ఉత్తరాంధ్ర వీర మహిళా రీజనల్ కో ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మి రాజ్, చేనేత విభాగం కార్యదర్శి కాటం అశ్విని, వీర మహిళలు గంట్లాన పుష్ప కుమారి, మాతా గాయిత్రి, భారతి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు డోల రాజేంద్ర ప్రసాద్, జనసేన నాయకులు రౌతు సతీష్, వంక నరిసింగరావు, యర్నాగుల చక్రవర్తి, రవితేజ, పిడుగు సతీష్, లోపింటీ కళ్యాణ్, మేడేపల్లి పవన్, జి.వెంకటేష్, వి.నవీన్ కుమార్, పిల్లా మణికంఠ, పి.శరత్ తదితరులు భారీగా జనసైనుకులు పాల్గొన్నారు.