పాకాల జనసేన ఆద్వర్యంలో యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ

చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలంలో జనవరి 12న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ యువత భవిష్యత్తు కోసం చేపడుతున్న యువశక్తి కార్యక్రమం గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా యువశక్తి పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం. నాసీర్, పాకాల మండల ఉపాధ్యక్షులు దినేష్, పాకాల మండల ప్రధాన కార్యదర్శి రహంతుళ్ళ, కార్యదర్శి షాజహాన్, సంయుక్త కార్యదర్శి మస్తాన్, హరి, జనసేన నాయకులు రిజ్వాన్, మునీర్, షాహుల్, తాహీర్, జనసైనికులు ఆసిఫ్, షాహిద్ తదితరులు పాల్గొన్నారు.