కొణెదల పవన్ కళ్యాణ్ మరియు తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ లను అఖండ మెజార్టీతో గెలిపించుకుందాం – జ్యోతుల శ్రీనివాసు.

కాకినాడ జిల్లా, పిఠాపురం, కాకినాడ జిల్లాలో జనసేన పార్టీ చాలా బలంగా ఉన్న కారణంగా పిఠాపురం నియోజవర్గం నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శాసనసభ్యునిగా లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవడానికి జనసేననాయకులు, జనసైనికులు, వీరమహిళలు, ప్రజల సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా నిన్న మంళగిరి కేంద్రజనసేనపార్టీ కార్యాలయంలొ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన వైసిపి పార్టీ నుండి జనసేనపార్టీలో జాయినింగ్ కార్యక్రమం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి జనసేన-తెలుగుదేశం-బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించడం శుభసూచకమని జ్యోతుల శ్రీనివాసు అన్నారు. పిఠాపురం నియోజవర్గం నుండి శాసనసభ్యునిగా పవన్ కళ్యాణ్, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి తంగెళ్ళ శ్రీనివాస్ అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవలసినటువంటి కర్తవ్యం జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు, ప్రజలపైన ఉన్నదని జ్యోతుల శ్రీనివాసు తెలిపారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి రహిత పరిపాలనా కోసం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా నీతి నిజాయితీవంతమైన పాలన అందించే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహంతో బిజెపి, టిడిపి పార్టీలతో ముందుకు వెళుతున్న ఈ తరుణంలో జనసేననాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు కూడా పవన్ కళ్యాణ్ వ్యూహాన్ని అనుసరించి రేపు పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలో కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ని అదే విధంగా కాకినాడ-2, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాల నుండి జనసేన అభ్యర్థులను పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు తుని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన-తెలుగుదేశం-బిజెపి కూటమి,అదే విధంగా కేంద్రంలో ఎండిఏ కూటమి ప్రభుత్వం మూడోసారి ఏర్పాటు చేయడానికి తగిన ప్రోత్సహం ఇవ్వాలని ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు తెలియజేశారు.