కొత్త సంవత్సరంలో ఎన్ని రోజులు సెలవులో తెలుసా?

2020 సంవత్సరం ముగుస్తుండటంతో రాబోయే కొత్త సంవత్సరం 2021లో ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయో ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన క్యాలెండర్ లో తెలిసొచ్చింది. ఈ ఏడాది లో పండగలకు వచ్చిన సెలవులన్ని ఎక్కువ ఆదివారాల్లో వచ్చాయి. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది సెలవులు లేకుండా పోయింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన 2021 సంవత్సరం క్యాలెండర్ లో దాదాపు 44 సెలవులు వచ్చాయి. పండుగలు, ఇతర ప్రభుత్వం సెలవు ల తో కలిపి 44 ఉన్నాయి. కాబట్టి వచ్చే ఏడాది ప్రభుత్వ ఉద్యోగులకు, పాఠశాలలకు, కళాశాలలకు, ఇతర రంగాల వారికి సెలవులు ఎక్కువగా ఉన్నాయి.

ఈ ఏడాది కరోనా వైరస్ వల్ల పాఠశాలు, కళాశాల లను మూసి వేయగా ఈ సంవత్సరం మొత్తం సెలవులతో నే గడిచింది. అదే విధంగా వచ్చే ఏడాది కూడా పండుగల సందర్భంగా ఎక్కువగా సెలవులు వస్తున్నాయి. కాగా వచ్చే ఏడాది లో వస్తున్న పండుగలు తేది తో సహా వారములను ఇప్పుడు చూద్దాం.

నూతన సంవత్సరం జనవరి 1 శుక్రవారంతో మొదలు కాగా.

మూడురోజుల సంక్రాంతి పండగ 13,14,15.బుధ, గురు, శుక్రవారాల్లో వచ్చాయి.

ప్రభుత్వ సెలవు రిపబ్లిక్ డే 26 మంగళవారం వచ్చింది.ఫిబ్రవరిలో ఒక ఆప్షనల్ సెలవు ఉండగా అది 25 గురువారం వచ్చింది.

మార్చి నెలలో మహాశివరాత్రి 11 గురువారం, హోలీ 29 సోమవారం వచ్చాయి.ఏప్రిల్ నెలలో గుడ్ ఫ్రైడే 2 శుక్రవారం, బాబు జగ్జీవన్ రామ్ జయంతి 5 సోమవారం, ఉగాది 13 మంగళవారం, అంబేద్కర్ జయంతి 14 బుధవారం వచ్చాయి.

మే లో రంజాన్ 14 శుక్రవారం రాగా, జూలైలో బక్రీద్ 21 బుధవారం, ఆగస్టు నెలలో మొహర్రం 19 గురువారం, శ్రీ కృష్ణాష్టమి 30 సోమవారం వచ్చాయి.సెప్టెంబర్ 10 వినాయక చవితి శుక్రవారం వచ్చింది.

అక్టోబర్ నెలలో మహాత్మా గాంధీ జయంతి 2 శనివారం, దుర్గాష్టమి 13 బుధవారం, విజయదశమి 15 శుక్రవారం, ఈద్ మిలాద్ ఉన్ నబీ 20 బుధవారం వచ్చాయి.నవంబర్ 4 గురువారం దీపావళి, డిసెంబర్ 25 శనివారం క్రిస్మస్ వచ్చాయి.

ఈ విధంగా ఈ వారాల్లో పండుగల సెలవులు రాగా… ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం ఆదివారం రోజున వచ్చింది.మిగతా ఆప్షనల్ ప్రభుత్వ సెలవులు కూడా 4 సెలవులు ఆదివారాల్లో రాగా. మిగతా ఆప్షనల్ సెలవులు మిగతా వారాలలో వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *