జనసేన జెండా ఎగరేద్దాం!
- పార్టీ శ్రేణులకు జనసేన రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ దిశానిర్దేశం
చల్లపల్లి: 2024 ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులిద్దరినీ గెలిపించుకోవడం ద్వారా జనసేన జెండాను సగర్వంగా ఎగరేయాలని జనసేన రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జనసేన స్థానిక కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలి రాజేష్ మాట్లాడుతూ, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ లను భారీ మెజారిటీతో గెలిపించి, జనసేన సత్తా చాటి చెప్పాలని అన్నారు. కూటమి మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. తెలుగుదేశం, బీజేపీ శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ, పార్టీ విజయమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జనసేన నేతలు కూనపరెడ్డి శ్రీనివాసరావు, వల్లభనేని బాల కోటేశ్వరరావు, అడపా రాంబాబు, బొందలపాటి వీరబాబు, గాజుల తాతారావు, సోమిశెట్టి రాఘవ, పిండిశెట్టి నిరంజన్, ఉరిమి మణికాంత్, తోట మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.