ఆకతాయిలను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి: రాందాస్ చౌదరి

మదనపల్లిలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో గరుడోత్సవం జరిగే సమయంలో ఒక్క కానిస్టేబుల్ కుడా లేకపోవడం గమనార్హం. రాత్రి సమయంలో గరుడోత్సవం జరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవలసిన పోలీసు శాఖవారు కానీ, ఎమ్మెల్యే గానీ ఎటువంటి భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయలేదని, కనీస బాధ్యతగా ఆలయ కమిటీతో పోలీసు అధికారులతో సమావేశమై తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన కనీస బాధ్యత ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని విభాగాల్లోనూ వైఫల్యం చెందింది. రాత్రి గరుడోత్సవం ప్రారంభమైన కొద్దిసేపటికి స్థానిక ప్రసన్న వెంకటరమణస్వామి గుడి ముందర కొంతమంది ఆకతాయిలు మద్యం సేవించి అసభ్యకరంగా మాట్లాడి నలుగురిని చితకబాది చిత్రహింసలకి గురి చేస్తా ఉంటే స్థానిక ఎమ్మెల్యే ఏమి చేస్తా ఉన్నారని, స్థానిక ఎస్ఐ తక్షణమే విచారణ చేసి అటువంటి ఆకతాయిలను అరెస్ట్ చేయలని, లేని పక్షంలో పట్టణంలో మత సామరస్యం దెబ్బతిని శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ఆకతాయిలను 24 గంటల్లో అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని లేకపోతే వ్యక్తిగతంగా గాని, లేదంటే జనసేన పార్టీ తరఫున గాని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జనసేన పార్టీ రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.