గిరిజనులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం: జనసేన మురళి

  • మా మైనింగ్ మాకు ఇప్పించండి.. నిమ్మలపాడు గ్రామస్తుల డిమాండ్

అనంతగిరి: మా మైనింగ్ మాకు ఇప్పించండి ఎస్ పికి నిమ్మలపాడు గ్రామస్తులు మరియు జనసేన నాయకులు ఫిర్యాదు చేసారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు బినామీలు పెట్టి దౌర్జన్యం చేసి ప్రజలను గ్రామాలలో మండలాల్లో లేకుండా చేయాలని చూస్తున్నారు. మండలంలో ఉన్న అపార ఖనిజ సంపదను తరలించుకు పోవటానికి మైనింగ్ మాఫియా దుర్య రుక్మిణి రబ్బ శంకర్రావు మరియు ఈ మాఫియా వెనుక అధికార పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి నాయకుడు కుంభ రవి బాబు బినామీలతో వ్యవహారం నడిపిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్థానిక ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం చాలా విడ్డూరంగా ఉందని, ఈ ఖనిజసంపదపై తవ్వకాలకు గిరిజనులంతా వ్యతిరేకంగా ఉన్నా కొంతమంది నాయకులు ఏజెంట్లుగా తయారై గ్రామంలో ఉన్న తాజా పరిస్థితులను ఎప్పటికీ ఎప్పుడు సమాచారం మాఫియాకు తెలియజేస్తున్నారు అమాయక గిరిజనులను లేనిపోని ఆశలు కలిగించి మైనింగ్ మాఫియా తవ్వకాలు కొనసాగించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికైనా గిరిజనులు మేలుకోకపోతే రాబోయే భవిష్యత్ మొత్తం ప్రమాదంలో పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని గతంలో ఇలాంటి విషయంలోనే అప్పటి శాసనసభ్యులు మాజీ శాసన సభ్యులను మావోయిస్టులు ప్రజా కోర్టులో శిక్ష వేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎటువంటి అనుమతులు గాని ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా అనుమతులు జారీ చేస్తే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని గిరిజనులు మాట్లాడుకుంటున్నారు మారుమూల గ్రామం నిమ్మలపాడు తుంపర్తి సర్వే నంబర్ 35, 33, నంబర్లలో అనుమతులు మంజూరైనట్లు సమాచారం. ఈ అక్రమ తవ్వకాలకు గ్రామస్తులు మరియు జనసేన పార్టీ పూర్తిగా వ్యతిరేకమని, గిరిజనులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని అనంతగిరి జనసేన మండల పార్టీ అధ్యక్షులు చిట్టం మురళి విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.