ఆప్ సబ్ కి అవాజ్ అధ్వర్యంలో ఘనంగా జేడీ జన్మదిన వేడుకలు

విశాఖపట్నం, జేడీ లక్ష్మీనారాయణ జన్మదిన సందర్భంగా విశాఖపట్నంలో పలుచోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా ఆప్ సబ్ కి అవాజ్ సౌజన్యంతో విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజీలో నిర్వహించారు. ఉత్తరాంధ్రలో అనేక రకమైన కాలేజీలు అలానే ఉత్తరాంధ్రలో ఎన్జీవోలు అన్నీ కలిసి సమాజంలో ఎన్నో సేవలు చేస్తున్న వారిని అభినందించారు. లక్ష్మీనారాయణ రక్తదాన శిబిరమును ఉద్దేశించి రానున్న రోజులు వేసవికాలం అని వేసవికాలంలో రక్త నిలువులు సాధ్యం కాదని ఈ కారణంగా రక్తదాన శిబిరాలు ఈరోజున ఏర్పాటు చేయడం, దీనికి మద్దతుగా విజ్ఞాన్ లో 300 మందికి పైగా విద్యార్థులు ముందుకు వచ్చి ఇవ్వడం చాలా హర్షనీయమని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు సమాజానికి ఏదో చేయాలి, సమాజానికి సేవ చేయడంలో విద్యార్థులు యువ సంఘాలు ముందుకు రావడం సమాజంలో మార్పు తేవడానికి మూలకారకులవుతారని, అలానే మాలాంటి వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాలు ఈరోజు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి చేయడం ఆనందకరమని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రక్తదానం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆప్ సబ్ కీ అవాజ్ ఈ మధ్యకాలంలో అనేక మందికి సోషల్ మీడియాలో ఎవరికైతే రక్తం అత్యవసర సమయంలో కావాలో వారికి తక్షణ సమయంలో ఏర్పాటు చేయడంలో ముందు ఉందని ఆ సంస్థలో ఉన్న ప్రతినిధుల్ని, ఆ సంస్థ ఫౌండర్ జనరల్ సెక్రెటరీ కిరణ్ కుమార్ బావిశెట్టిని అభినందించారు. వీరికి తోడుగా విజ్ఞాన్ కాలేజ్ వారు ఎప్పుడు సహాయము అందిస్తున్న వారున్ని కూడా ప్రైమ్ 9 ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా అభినందించారు.

స్టీల్ ప్లాంట్ ని ఉద్దేశించి మాట్లాడుతూ వారి యొక్క ఉద్యమానికి ప్రోత్సహిస్తున్నట్లు తెలియజేశారు. స్ట్రీట్ ప్లాంట్ లో ఈ మధ్యకాలంలో పూర్తిగా ప్రైవేటుకరణకు మద్దతు ఇస్తున్నాయని లీగల్ అడ్వైజర్ ట్రాన్సిషన్ అడ్వైజర్ అంటూ కొత్తడ్రామాకు తెరతీస్తున్నట్టు సందేశాన్ని ఇచ్చారు. మొన్ననే మార్చ్ 27వ తారీఖున ఇంట్రెస్ట్ ఆఫ్ ఎక్స్ప్రెస్ (ఈఓఐ) ను అడ్డం పెట్టుకొని మీకు కోల్ ఇస్తామని, కుక్ ఇస్తామని, వర్కింగ్ క్యాపిటల్ ఇస్తామని మభ్యపెట్టి ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నాల్లో ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ పక్కనపెట్టి రాష్ట్ర గవర్నమెంట్ ఆదుకోవాలని విన్నవించారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ టాక్స్ ల రూపంలో 42 వేల కోట్లు గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో పే చేసిందని అలాంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఐదు వేల కోట్లు రూపాయలు సమకూర్చే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో నుంచి బయటపడుతుందని తెలియజేశారు. ఇప్పటికీ రాష్ట్ర గవర్నమెంటు 4986 కోట్లు ఇచ్చిందని అయితే ఆ సహాయంతో పాటు 500 ఐరన్ ఓర్ మైన్స్ స్టీల్ ప్లాంట్ కి సమకూర్స్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వస్తుందని ప్లాంట్ ను ప్రైవేటికన్నా చేయకుండా స్టీల్ యూనిట్ ఏర్పాటు చేసి పోరాటంలో ముందుకు వెళితే బాగుంటుంది అంతేకాదు స్టీల్ ప్లాంట్ ఎందరికో సెంటిమెంట్ గా ఉంది కనుక వాళ్ల జీవన ఉపాధి కల్పించే ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ రోజున గాజువాకలో గంగవరం పోర్టు ఆదానికి అమ్మేయడంతో రెండు నెలల నుంచి ఆ ఉద్యోగులకి జీతాలు లేకపోవడం వాళ్ళు రోడ్డున పడి జీతాల కోసం పోరాటం చేయడం చాలా బాధాకరంగా భావించారు. దేశ ఖనిజను సంపదను పొరుగు దేశాల వారికి తమ అనుకూలమైన వారికి అప్పగిస్తే భారత్ ప్రజలు ఏమైపోవాలి అని ప్రశ్నించారు. మన దేశ సంపదను మనం కాపాడుకోవాలి సోషలిజంను కాపాడుకోవాలి, సోషలిజం అంటే మన దేశ సంపదను మనకు చెందడం అది సోషలిజం. ఇది ఈ ప్రభుత్వాలకు తెలియడం లేదా తెలిసి ప్రైవేతీకరణల వల్ల లబ్ధి పొందుతున్నారా అని వ్యాఖ్యానించారు. ఈరోజు నా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన సింహాద్రి టి.ఎం.టి వి.వి కృష్ణారావు, డైరెక్టర్ & సురభి క్లినిక్ డాక్టర్ జి.వి.ఎస్ రాము(ఆర్ధో) మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. నాగేంద్రబాబు ఎస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆప్ సబ్ కి ఆవాజ్ ఫౌండర్ జనరల్ సెక్రెటరీ కిరణ్ కుమార్ బావిశెట్టి, జాయింట్ సెక్రెటరీ కొండేటి భాస్కర్, లాయర్ కరణం కళావతి, సమస్త సభ్యులు రవి తేజ మరియు ఆప్ సబ్ కి అవాజ్ దివ్యాంగుల వైస్ చైర్మన్ కర్రి దినేష్ విహార్ పాల్గొన్నారు.