కోటి వృక్షార్చనలో పాల్గొందాం..

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 17న గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా కోటివృక్షార్చన కార్యక్రమంలో పాల్గొనాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో కోటి మొక్కలు నాటి సీఎం కేసీఆర్ కు హరిత కానుకగా ఇవ్వాలన్నారు ఎమ్మెల్యే రోజా.