ఆడుదాం ఆంధ్ర ఒక పొలిటికల్ డ్రామా

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం: ఆంధ్రప్రదేశ్ కి వైసీపీ తీసుకొచ్చిన కొత్త పొలిటికల్ డ్రామా ఆడుదాం ఆంధ్ర అని జనసేన పార్టీ చేనేత రాష్ట్ర కార్యదర్శి మరియు న్యాయవాది ఎం. హనుమాన్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో గత 4.5 సంవత్సరాల నుంచి ఆడుకుంది సరిపోవడం లేదా జగన్మోహన్ రెడ్డి గారు.. ఆడుదాం ఆంధ్ర అని క్రీడాకారుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు మీరు.. ఇది కేవలం వైసీపీ ఓట్లు కోసం ఆడే డ్రామా దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దీని గమనించాలి ఇలాంటి ప్రోత్సహించకండి. నిజంగా వైసిపి వాళ్ళకి క్రీడాకారుల మీద అంత చిత్తశుద్ధి ప్రేమ ఉంటే 2019, 2021, 2022 లో ఎందుకు మీరు ఇలాంటి ఆడుకుందాం ప్రోగ్రాములు పెట్టలేదు. అసలు క్రీడాకారుల మీద నిజంగా మీకు ప్రేమే ఉంటే ఏ అర్హత లేని ఒక గూండాని శాఫ్ చైర్మన్ చేసేవాళ్ళు కాదు. క్రీడల గురించి అవగాహన లేని చైర్మన్ నియమించడం క్రీడాకారులకి సిగ్గుచేటు. శాప్ చైర్మన్ ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్న మీకు నీ శాఖ గురించి మీకు పూర్తిగా తెలుసా. శాప్ అంటే ఏంటి ప్రభుత్వంలో అర్హత అయ్యే స్పోర్ట్స్ కోట తెలుసా??. ప్రతి సంవత్సరం ఎన్ని క్రీడలు రిజర్వేషన్ కోటలో సీట్లు కేటాయించాలో తెలుసా?? కొత్త స్పోర్ట్స్ ఎలా అప్రూవ్ చేయాలో తెలుసా?? స్కూల్ గేమ్ ఫెడరేషన్ లో ఏ స్పోర్ట్స్ ని యాడ్ చేయాలి ఎలా ఎలిజిబుల్ లో పెట్టాలో తెలుసా? కొత్త క్రీడల్ని రాష్ట్రానికి ఏ విధంగా తీసుకురావాలో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చాక బైరెడ్డి శాప్ చైర్మన్ అయ్యాక ఎంత మంది ఒలంపిక్స్ ప్రోత్సహించారు చెప్పగలరా?? ఒలంపిక్స్ కమిటీ గాని స్పోర్ట్స్ ఫెడరేషన్ కి గాని ఎంత నిధులు కేటాయించారో చెప్పగలరా?? మేము స్పోర్ట్స్ స్టేట్ లెవెల్ ఉంటూ కరాటే ఫెడరేషన్ లో ప్రెసిడెంట్ గా ఉండి ఎంతోమంది నిరుపేద క్రెడాకారులకి ప్రోత్సహించి ముందుకు రానిచ్చాము చెప్పమంటావా!! కనీసం క్రీడల్లో నాకుండే అవగాహనలో కనీసం 5% అవగాహన ఈ సాప్ చైర్మన్ కి ఉంటే క్రీడాకారులకు ఒక గుర్తింపు లభించేది దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించాలి. క్రీడాకారులు గమనించాలి ఇది ఆడుకుందాం ఆంధ్ర అనేది కేవలం వైసీపీ లబ్ధి కోసమే చేస్తున్నారు. వైసిపి ఆడే పొలిటికల్ డ్రామా కేవలం ఓట్లు కోసమే ప్రజా జీవితంతో ఆడుకున్న వైసిపి నాయకులకి బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉంది. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించవలసిందిగా కోరుకుంటున్నానని హనుమాన్ తెలిపారు.