దర్శి జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గం: జనసేన సంక్రాంతి సంబరాల్లో భాగంగా దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో తాళ్లూరు మండలంలోని తోట వెంగణ పాలెం గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ జనసేన ఇన్చార్జి బొట్టుకు రమేష్ కురిచేడు మండల జనసేన అధ్యక్షులు మాద శేషయ్య, జనసేన నాయకులు ఏసు రెడ్డి, గరికపాటి పుల్లయ్య, తాళ్లూరు మండల వీరమహిళ సుజాత, పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.