బలరాముడి టార్గెట్ 50,000 సభ్యత్వాలు..!

  • మూడో విడత క్రియాశీలక సభ్యత్వాలు నమోదు దిగ్విజయం చేద్దాం
  • జనసేన పార్టీ కోసం పని చేసిన ప్రతీ కార్యకర్తను, జనసేన సానుభూతిపరులకు ప్రతి ఒక్కరికి ఈ సభ్యత్వం ఇచ్చేలా కృషి చేద్దాం
  • నియోజవర్గంలో 50,000 వేల సభ్యత్వాలు టార్గెట్ పెట్టుకుని… రాష్ట్రంలోనే మన నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలిచేలా సమిష్టిగా కష్టపడదాం
  • క్రియాశీలక సభ్యత్వం యొక్క విశిష్టతను ప్రతి సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో వివరించి సభ్యత్వం ఇప్పించే బాధ్యత వాలంటీర్లదే
  • క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యాచరణ కార్యక్రమంలో బత్తుల

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షులు గౌ” శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసైనికుల కుటుంబాలకు కష్ట కాలంలో ఆర్థిక భరోసా కల్పించేలా ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన జనసేన క్రియాశీలక సభ్యత్వాలు నమోదు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని.. నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ కోసం కష్టపడిన ప్రతి జనసైనికుడిని, జనసేన సానుభూతిపరులను ప్రతి ఒక్కరికి జనసేన క్రియాశీలక సభ్యత్వం ఇప్పించి.. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగ నటువంటి సభ్యత్వాల నమోదు మన రాజానగరం నియోజకవర్గంలోనే జరగాలని.. 50,000 వేలు టార్గెట్ పెట్టుకుని.. ప్రతి ఒక్కరూ శ్రమపడాలని పిలుపునిస్తూ.. గతంలో సభ్యత్వం తీసుకున్నవారు తిరిగి రెన్యువల్ చేయించుకోవాలని, తీసుకొని వారు క్రియాశీలకు వాలంటీర్ల ద్వారా సభ్యత్వ నమోదు చేయించుకోవాలని.. ఈ సభ్యత్వం యొక్క విశిష్టతను పవన్ కళ్యాణ్ గారు ఎంతో ముందుచూపుతో ప్రవేశపెట్టడం జరిగిందని దీనికి ఆయన పెద్ద మొత్తంలో నగదు ఇచ్చి.. ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తలకు పరోక్షంగా పెద్దన్నలా ఆదుకుంటున్నారని వివరిస్తూ.. ఫిబ్రవరి 10 నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమం 28 వరకు కొనసాగుతుందని.. వాలంటీర్లను ఇప్పటికే కొంతమంది పేర్లు నమోదు చేసుకోగా.. మరి కొంతమందికి సభ్యత్వాల లింకులు అందజేస్తామని.. పదో తారీఖున లింకు అందజేసి, రాజానగరం నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి జనసేన పార్టీ సత్తా చాటుతామని.. తద్వారా జనసేన కుటుంబాలకు ఆర్థికపరమైన భద్రతను, భరోసాను కల్పిస్తామని వివరించారు.. అనంతరం సోషల్ మీడియా విభాగాన్ని మరింత పటిష్టపరిచే ఉద్దేశంతో పలువురు కంటెంట్ రైటర్లు, ఎడిటర్లు, ఫోటోగ్రాఫర్స్ తో సమావేశమై వారి పనితీరు ఆధారంగా త్వరలో వారికి పనులు అప్పచెబుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.