గాఢ నిద్రలో ఉన్న సీఎం మేలుకొలుపుతాం: షేక్ మహబూబ్ మస్తాన్

గాఢనిద్రలో ఉన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేలుకొలుపుతామని ఈ నెల 15,16,17 తేదీన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మను క్రాంతి చెన్నారెడ్డ సూచన మేరకు.. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హ్యా ష్ ట్యాగ్ తో డిజిటల్ ప్రచారం ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. మండల అధ్యక్షుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే ప్రయాణించడానికి రోడ్లు అడుగుకు ఒక గుంత.. గజానికి ఒక గొయ్యి లాగా తయారైందని.. జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తయిన రాష్ట్రంలో మౌలిక వసతులు లేవని హేళన చేస్తూ ప్రజలు మాట్లాడుతున్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో గాడ నిద్రలో ఉన్న సీఎం గారిని మేలుకొలుపుతామని 15 ,16, 17 తేదీన #గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని డిజిటల్ క్యాంపియన్ తొ రోడ్లమీద నిరసన, రోడ్ల దుస్థితి ప్రదర్శిస్తున్నాం. పన్నులు, సెస్స్ల రూపంలో వేల కోట్లు వసూలు చేస్తున్న ప్రభుత్వ మౌలిక వసతుల కల్పనలో విఫలమైందన్నారు. అద్వానంగా ఉన్న రోడ్ల వల్ల నూతనంగా కొనుక్కున్న వాహనాలు కూడా అతి తక్కువ సమయంలో మరమ్మతులు చేపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ రోడ్ల కోసం జనసేన పార్టీ తరపున పోరాటం చేస్తామని అన్నారు.