శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన క్రియాశీల సభ్యత్వ కిట్లు పంపిణి

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ క్రియాశీల సబ్యులకు ఐ.డి. కార్డులు, సభ్యత్వ కిట్లు ( బ్యాగ్, గ్లాస్, బుక్, పవన్ కళ్యాణ్ గారి మనోగతం బుక్) ను నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా సభ్యత్వ నమోదు చేయించిన వాలంటీర్ సబ్యులకు శ్రీకాళహస్తి పట్టణంలో సమావేశం ఏర్పాటు చేసి అందజేశారు. క్రియాశీల సభుత్వం నమోదు చేసిన వాలంటీర్లను వినుత దుస్సాలువతో సన్మానించి వారు చేసిన సభ్యత్వ కిట్లను అందజేశారు. నియోజకవర్గంలో 2100 మంది సభ్యులు 500 రూపాయలు కట్టి జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం పొందారు. ఈ సందర్భంగా క్రియాశీల వాలంటీర్ సభ్యులు క్షేత్ర స్థాయిలో బలంగా పోరాడి రానున్న ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగురవేయాలని క్రియాశీలక సబ్యులను కోరడం జరిగింది.