ఆధార్ కార్డును ఓటర్ కార్డు తో లింక్ చేస్తే.. దొంగ ఓట్లని అరికట్టవచ్చు: పైల లక్ష్మి

మన్యం జిల్లా పార్వతిపురం కలెక్టర్ కార్యాలయం వద్ద 17 సంవత్సరాలు దాటిన వారికి ఓటు నమోదు కార్యక్రమం పెట్టారు.. ఈ కార్యక్రమంలో పార్వతిపురం జనసేన పార్టీ తరుపున పార్వతిపురం పైల లక్ష్మి మాట్లాడుతూ.. ఇప్పుడు ప్రతీ విషయానికి ఆధార్ కార్డు లింకు ఉంది.. ఆధార్ కార్డును ఓటర్ కార్డు లింక్ చేయండి.. అప్పుడు దొంగ ఓట్లని అరికట్టవచ్చు అని తెలియజేసారు. ఈ మీటింగ్ కి అన్ని పార్టీ వాళ్ళు హాజరయ్యారు. జనసేన పార్టీ తరుపున చెప్పిన విషయం విన్న కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ.. ఈ విషయంలో రానున్న రోజుల్లో తగు చర్యలు తీసుకుంటామని.. తప్పక తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.