సినీ నటుడు పోసాని కృష్ణమురళి వ్యాఖ్యల పై మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన జనసైనికులు

సినీ నటుడు పోసాని కృష్ణమురళి పై జనసైనికులు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా పోసాని పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు చారి , తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం కార్యనిర్వాహక సభ్యుడు CH. సాయిసాగర్ (చుక్కనాని), జనసేన వీర మహిళలు, జనసేన మల్కాజిగిరి నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.