ముస్లింలంటే జగన్ రెడ్డికి చులకన భావం తగదు

  • మదరసాలంటే జగన్ రెడ్డికి పడదా?
  • 50,000 రూపాయలు మదరసా ఈ మునర్వా సంస్థకు ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వానికి భాద్యతను గుర్తు చేసిన ప్రముఖ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ భాయ్

నెల్లూరు: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాల నుంచి మదరసాల నిర్వహణకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని నిలిపివేసి.. పలుమార్లు ప్రభుత్వ అధికారులకు గుర్తు చేసినా లెక్క చేయక మధురాసాల నిర్వీర్యానికి కారణం అవుతుంది అని.. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ద్వారా తెలుసుకొని నెల్లూరు రూరల్ లోని మధురసా ఈ మన్వర్ సంస్థకు తొలితగా 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి మదరసాను యధావిధిగా కొనసాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేటట్లు ప్రముఖ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ బాయ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేను చేసిన ఆర్థిక సాయం పెద్దది కాకపోవచ్చు.. ఈ విధంగానైనా ప్రభుత్వానికి మదరసాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ అనాదిగా అనాదిగా మతాచారంగా భావిస్తున్న మదరసాలకు ప్రభుత్వం అందించాల్సిన నిధులను కేటాయించి ముస్లింల మనోభావాలు దెబ్బతియ్య వద్దని గుర్తు చేస్తున్నాను.. అనాదిగా మతాచారాలకు పాటిస్తూ నడుపుతున్న మధురసాలను నిర్వీర్యం చేయడం తగదు. ఎవరి మతం వారికి గొప్ప.. గత ప్రభుత్వాలు ఎంతోకాలంగా మదరసాల కు ఆర్థిక సహాయం చేస్తున్నాయి. అనాదిగా ముస్లింలు మదరసాల చదవడం గొప్పగా భావిస్తూ… కొంతమంది వాటిలోనే చదివించటం ఆచారంగా ఉంది. వాటికి ప్రభుత్వ సహకారం దశాబ్దాలుగా నడుస్తుంది.. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి వాటి నిర్వహణకై ఖర్చును శాలరీలను మిడ్ డే మీల్స్ కు అవసరమైన నిధులను సమకూర్చకుండా వాటిని నిర్వీర్యం చేయాలని చూడడం సమంజసం కాదు. ప్రజాస్వామిక దేశంలో ఎవరి ఎవరి మతాలను స్వేచ్ఛగా ఆచరించవచ్చు అటువంటిది ప్రత్యేకంగా మదరసాలను నిర్లక్ష్యం చేయడం తగదని తెలిపారు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ముస్లింలకు ప్రత్యేకంగా చేసిందేమీ లేకపోయినా ఎప్పటినుంచో కొనసాగుతున్న మదరసాల నిర్వహణ నిధులు ఆపటం సమంజసం కాదని తెలిపారు. ఈ 50వేల రూపాయల సహాయం కేవలం నామ మాత్రమే కానీ ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చేసేందుకే తనవంతుగా 50వేల రూపాయలు సహాయం చేయడం జరిగిందని జానీ మాస్టర్ చెప్పారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ బాయ్ తో పాటు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు బద్దిపూడి సుదీర్ తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.