ఉపాధి హామీ కూలీల దాహం తీర్చి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గం, పూసపాటి రేగ మండలం, రెల్లివలస గ్రామంలో గురువారం ఉపాధిహామీ పధకంలో భాగంగా పనిచేస్తున్న వారి దగ్గరకి వెళ్లి లోకం మాధవి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకం మాధవి మాట్లాడుతూ.. ఈ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలలోని ప్రజలు చితికిపోయారని, ప్రభుత్వ పధకాలు కొంతమంది ప్రజలకే చేరువవుతున్నాయి అని అలాగే రైతాంగం ఎంతో అప్పుల పాలయ్యి మనోవేదనకి గురవుతున్నారని ఇలాంటి పాలన పోయి, ప్రజా పాలన రావాలి అంటే ప్రజలు మొత్తం ఏకతాటిగా పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఎన్నికల్లో మద్దతు తెలియజేయాలని లోకం మాధవి కోరారు. ఈ కార్యక్రమంలో గుడివాడ జమ్మిరాజు మరియు తదితర జనసైనికులు పాల్గొన్నారు.