క్షతగాత్రులకు అండగా లోకం ప్రసాద్

విజయనగరం జిల్లా, ఎల్.కోట మండలం, కంటకాపల్లిలో జరిగిన రైలు ప్రమాదం గురించి తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకొని, ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన-టిడిపి పార్టీల సమన్వయకర్త, నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి లోకం మాధవి ఆదేశాల మేరకు నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకులు లోకం ప్రసాద్ జరిగిన ప్రమాదాన్ని, పరిస్థితుల్ని పరిశీలించడం జరిగిది. సంఘటన స్థలంలో రైల్వే అధికారులు చేపడుతున్న సహాయ చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు వాటర్ బాటిల్స్ మరియు బిస్కెట్ ప్యాకెట్లు, అదేవిధంగా ప్రధమ చికిత్స కిట్లు పంపిణీ చేయడం జరిగింది.