జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ పోస్టర్ ను ఆవిష్కరించిన శెట్టిబత్తుల రాజబాబు

  • నియోజకవర్గాల వారీగా “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” పోస్టర్ల పంపిణీ కార్యక్రమం

అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం నియోజకవర్గం, “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసును మరియు జనసేన అధినేత చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలలోనికి బలంగా తీసుకెళ్ళేందుకు రూపొందించిన జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ గా జనసేన సింబల్ గాజు గ్లాసుతో కూడిన 15000 పోస్టర్లను ప్రచురించి కొన్ని నియోజకవర్గాలకు పంపిణీ చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” రూపొందించిన 3 రకాల పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.