థామస్ నాయుడు కుటుంబానికి అండగా మాచర్ల జనసేన

మాచర్ల నియోజకవర్గంలో రచమల్లపాడు గ్రామంలో ఇటీవల చనిపోయినటువంటి జనసైనికుడు “వారణాసి థామస్ నాయుడు” కుటుంబాన్ని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పరామర్శించడం జరిగింది. థామస్ నాయుడు చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అలాగే మాచర్ల నియోజకవర్గ జనసైనికులు, నాయకులు అందరూ కలిసి వారి కుటుంబ సభ్యులకు 1,05,000/- రూపాయలు ఆర్థిక సహాయం చేయటం చాలా సంతోషకరమని వారికి మా పార్టీ తరఫున కొంత ఆర్థికంగా అలాగే భవిష్యత్తులో పిల్లల చదువుకి ఏమైనా అవసరాలకు మేము అందరం సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పులిహారి, మండల అధ్యక్షులు గుండెబోయిన సాంబశివరావు, తోటకూర శ్రీనివాసరావు, గంధం మల్లయ్య, కృష్ణ బాబు, లీగల్ సెల్ రామాంజనేయులు, సీనియర్ నాయకులు నక్షత్ర ప్రసాద్, భీమా అమరయ్య, మండల మరియు గ్రామ కమిటీ సభ్యులు వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు.

కారంపూడి మండల జనసేన కార్యాలయాన్ని ప్రారంభించిన గాదె

మాచర్ల నియోజకవర్గం, కారంపూడి మండల అధ్యక్షులు కేసరపల్లి కృష్ణ బాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల పార్టీ కార్యాలయాన్ని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పులిహారి, మండల అధ్యక్షులు గుండెబోయిన సాంబశివరావు, తోటకూర శ్రీనివాసరావు, గంధం మల్లయ్య, కృష్ణ బాబు, లీగల్ సెల్ రామాంజనేయులు, సీనియర్ నాయకులు నక్షత్ర ప్రసాద్, భీమా అమరయ్య, మండల మరియు గ్రామ కమిటీ సభ్యులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.