3036 క్రియాశీలక సభ్యత్యాలతో మొదటి స్దానంలో నిలచిన మదనపల్లె నియోజకవర్గం

మదనపల్లె: 3036 క్రియాశీలక సభ్యత్యాలతో జిల్లాలో అన్నమయ్య జిల్లాలో మదనపల్లె నియోజకవర్గం మొదటి స్దానంలో నిల్స్చినందుకు జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి సభ్యత్వ నమోదు వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాదుతూ గ్రామ స్థాయిలో జనసేన పార్టీ బలోపేతం చేయడం ద్వారా అధికారానికి రాచబాట వేస్తుందని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి, మదనపల్లె ఇన్‌ఛార్జ్ గంగారపు స్వాతి పేర్కొన్నారు. ‌క్రియశీలక సభ్యత్యాలలో అన్నమయ్య జిల్లాలో మదనపల్లె నియోజకవర్గ అత్యధికంగా 3036 సభ్యత్వాలు చేయడం జరిగిందని విలేఖరుల సమావేశంలో వివరించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని అధిక సంఖ్యలో క్రియాశీలక సభ్యత్వాలు చేసి సభ్యత్వ నమోదు వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సభ్యత్వ నమోదు చేసిన వాలంటీర్లకు ఈనెల 14 వ తేది జనసేన పార్టీ 10 ఆవిర్భావ సభలో విఐపి పాస్ ఇవ్వడమే కాకుండా ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మదనపల్లె నియోజకవర్గంలో మొత్తం వాలంటీర్ల ఇచ్చిన సమయంలో క్రియాశీలక సభ్యులను చేర్చడం సంతోషంగా ఉందన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రతి కార్యకర్త చురుకుగా పాల్గొని సభ్యులను చేయడం, రాష్ట్ర స్దాయిలో గుర్తింపు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఇదే విధంగా కష్టపడి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ‌