వాల్మీకి మహర్షికి నివాళులర్పించిన మదనపల్లె జనసేన

మదనపల్లె, చిత్తూరు బస్టాండు సర్కిల్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వాల్మీకి విగ్రహానికి జనసేన రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాందాస్ చౌదరి మాట్లాడుతూ యావత్ ప్రపంచానికి జీవన గమనాన్ని మార్గనిర్దేశం చేసే రామాయణ మహా కావ్యాన్ని రచించిన వాల్మీకి మహర్షి జయంతి ప్రతి ఒక్కరు జరుపుకోవాలని రామాయణాన్ని యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర, జిల్లా జాయింట్ సెక్రటరీ గజ్జల రెడ్డెప్ప, రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, చంద్రశేఖర, రెడ్డెమ్మ, గడ్డం లక్ష్మిపతి, అర్జున, జవిలి మోహన్ కృష్ణ, నారాయణ స్వామి, లవన్న, విజయ్ కుమార్, పవన్, జంగాల గౌతమ్, జై శేఖర్, నగేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.