రోడ్ల దుస్థితిపై గళమెత్తిన మదనపల్లి జనసేన

రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై మరోసారి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు రెండవ రోజు #GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయిన్ లోని భాగంగా 2వ రోజు మదనపల్లి నియోజకవర్గంలోని అమ్మ చెరువు మిట్టలోని కాలనీలో పాడైపోయిన, గొంతులు ఉన్న రోడ్లు ఫోటోలు తీసి సోషల్ మీడియా ద్వారా చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, మదనపల్లి నియోజవర్గ జనసేన పార్టీ నాయకులు దారం హరిప్రసాద్, శ్రీనివాసులు, రమణారెడ్డి, భాగ్యరాజా, చెర్రీ, లక్ష్మి పతి, పురుషోత్తం, శివ, మోహన, శంకర తదితరులు నిరసన వ్యక్తం చేశారు.