మహిళా లోకానికి జక్కంపూడి క్షమాపణ చెప్పాలి: పార్వతి నాయుడు డిమాండ్

  • జనసేన పార్టీ మహిళా రీజనల్ కో ఆర్డినేటర్ పార్వతి నాయుడు

వరద బాధితులను అదుకోమంటూ వినతిపత్రం ఇవ్వటానికి ప్రయత్నం చేసిన వీరమహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా మహిళాలోకానికి క్షమాపణ చెప్పాలని మహిళా రీజనల్ కో ఆర్డినేటర్ పార్వతి నాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.
వైసీపీ అగ్రస్థాయి నేతల నుంచి కిందిస్థాయి నాయకుల వరకు మాట్లాడే భాష చాలా అభ్యంతరంగా ఉందన్నారు. చివరికి వైసీపీలోని మహిళా నాయకురాళ్లు సైతం సభ్యతాసంస్కారాలు మరచి మాట్లాడటం దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఆరాచకాలను, అసమర్థతలను ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారని, సమాధానం చెప్పలేని స్థితిలో విచక్షణ కోల్పోయి భూతులు మాట్లాడుతూ ఎదురుదాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళలను అగౌరపరిచేలా ప్రవర్తించటం రాష్ట్రానికి మంచిది కాదన్నారు. మహిళలు తలుచుకుంటే వైసీపీని బంగాళాఖాతంలో కలిపేస్తారని, ఇప్పటికైనా మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని పార్వతి నాయుడు హితవు కలిపారు.
జిల్లా ఉపాదక్ష్యురాలు బిట్రగుంట మల్లిక మాట్లాడుతూ మహిళలను గౌరవించలేని సంస్కారహీన స్థితిలో వైసీపీ నేతలున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు భాష వింటుంటే మహిళలకు సిగ్గుగా ఉంటుందన్నారు. మహిళలు ఎక్కడైతే పూజింపపడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్నారు. అలాంటి మహిళలంటే చిన్నచూపు చూస్తూ పరిపాలన చేస్తున్న వైసీపీ నేతలకు మంచి బుద్ధి ప్రసాధించాలని దేవుణ్ణి వేడుకుంటున్నామని మల్లిక అన్నారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి పాల్గొన్నారు.