పేద విద్యార్ధులకి అండగా మాధవి లోకం

నెల్లిమర్ల, చదువే ఆయుధమని చదువుకుంటే పేదవారైనా అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చునని భావించి నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు మాధవి లోకం శుక్రవారం 10 మంది పేద విద్యార్థులను ఆదుకొని వారి చదువుకు అయ్యే పూర్తి ఖర్చుని కళాశాల ప్రిన్సిపాల్ కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కలాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మాధ్వి లోకం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. విద్యార్ధులు మాధవి లోకం కి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, విద్యార్ధులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.