ఘనంగా బత్తిన మధుబాబు జన్మదిన వేడుకలు

చిత్తూరు జిల్లా, మదనపల్లె నియోజకవర్గం స్థానిక టమాటా మార్కెట్ యార్డు వద్ద కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు జనసేన జిల్లా ఉపాధ్యక్షులు అయిన బత్తిన మధుబాబు జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య రైతుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయి. అభిమానులు బలిజ కులస్తులు మేళతాళాలతో టపాకాయలు పేల్చి మధుబాబుకి ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు మరియు చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత మరియు కాపు సంక్షేమ సేన వర్కింగ్ ప్రెసిడెంట్ శరత్, అన్నమయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు రెడ్డి రాణి, ములకలచెరువు జనసేన పార్టీ మండల అధ్యక్షులు పోతుల సాయినాథ్, తంబళ్ళపల్లి కాపు సంక్షేమ శాఖ అధ్యక్షులు అధికారి దేవేంద్ర, అర్జున్, తిరుపతి జిల్లా కాపు సంక్షేమ శాఖ అధ్యక్షులు హిమవంత్ రాయల్, మల్లిక, రూప, తిరుపతి రూరల్ జనసేన అధ్యక్షులు వెంకట్, రైతు విభాగం తిరుపతి జిల్లా అధ్యక్షులు రమేష్ రాయల్, తంబళ్ళపల్లి జనసేన నాయకులు రాజన్న, పవర్ ఆఫ్ ద టీం అధ్యక్షులు. గుమ్మిశెట్టి గోపాలకృష్ణ ముఖ్యఅతిథిలుగా హాజరై జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దుబాయ్ శీను, రెడ్డి సురేష్, అశ్వత్ రాయులు సుప్రీమ్ హర్ష తుపాకుల ధరణి రాయల్, శోభ, లక్ష్మీదేవి, తక్కోళ్ల శివ, చంద్రశేఖర్, శ్రీనివాసులు, రమేష్ సిద్దు, స్టీఫెన్, సోను, యూనస్ బొమ్మిశెట్టి రాజా, పసుపులేటి మూర్తి, శివ స్వామి వెంకటేష్, ఫాల్గుణ, గంగాధర చిన్న రెడ్డి, రాయదుర్గం జనార్ధన మరియు వందలాది మంది కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. సభికుల ప్రసంగం అనంతరం కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. సమావేశానికి పాల్గొన్న ముఖ్య అతిథులు శ్రీరామ రామాంజనేయులు, దారం అనిత, దారం హరిప్రసాద్ లను కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు మర్యాదపూర్వకంగా సన్మానించడం జరిగింది.