మదరాసా ఈ మునర్వా సంస్థకి జానీ మాస్టర్ ఆర్ధికసాయం

  • 50 వేల ఆర్థికసాయం
  • నిర్వహణకు ప్రతినెల పదివేల రూపాయల లెక్కన ఒక సంవత్సరం పాటు ఆర్థిక సహాయం

నెల్లూరు రూరల్ పొదలకూరు రోడ్డు, ప్రగతి నగర్లో గల మదరసా ఈ మునర్వా సంస్థకు 2019 నుంచి ప్రభుత్వం తరఫున ఆర్థికసాయం అందలేదని ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చేస్తూ ఈ ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు జానీ మాస్టర్ తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జనసేన నాయకులు కిషోర్ ద్వారా సమాచారం తెలుసుకున్నాను. ముస్లింలకు అందాల్సిన ఏ ఆర్థిక సహాయం కూడా ఈ జగన్ ప్రభుత్వంలో అందలేదు. 2019 జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నుంచి మదరసాల నిర్వహణకు అవసరం ఆర్థిక సహాయాన్ని, మిడ్ డే మీల్స్ ను ఆపివేయడం జరిగింది. వాటి గురించి పలమార్లు కలెక్టర్ మరియు డిఇవోలకు తాడేపల్లి కార్యాలయంకి తెలిపినప్పటికీ ప్రభుత్వం వాటిపై చర్యలు ఏమి తీసుకోలేదు. ఇప్పటికి కూడా మదర్సా నిర్వాహకులు సొంత డబ్బులతో జీతాలు, రెంటులు మధ్యాహ్నం భోజనాలు భరించుకోవాల్సి వస్తుంది. భారతదేశం సర్వమత సమ్మేళనం, ఎవరి మాతాచారాలను వారు స్వేచ్చగా పాటించవచ్చు. ముస్లిం ఆడబిడ్డలను దూరంగా కాక దగ్గరగా ఉన్న మదరసాలలో వారి కట్టుబాట్లు వారి నమ్మకాన్ని కాపాడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ చదివే వారందరూ పేద, బలహీన వర్గానికి చెందిన ముస్లింలే కావున వారికి అందించాల్సిన ఆర్దిక సహాయం అందించాల్సిందిగా ఎన్నో సంవత్సరం నుంచి కోరినప్పటికీ ఇప్పటికీ వారికి ఆ సహాయం అందలేదు. గత సంవత్సరం 2023 ఆగస్టు నెలలో అకౌంట్ సెక్షన్ లో ఫైల్ ఉందని మదరసాలకి సర్వ శిక్ష అభియాన్ నుంచి వస్తున్న ఆర్థిక సహాయాన్ని ఎప్పటిలాగే తన పేరుపై మార్చుకొని జగనన్న నయీ రోషన్ పథకం కింద ఇవ్వాల్సిన ఫండ్స్ వీలైనంత తొందరగా అందజేయాలని ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చేస్తూ తక్షణ సహాయం కింద 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని, మదరసా ఈ మునర్వా సంస్థకు అందజేసి వారికి రూము సరిపోనందున వాటి నిర్వహణకు ప్రతినెలా పదివేల రూపాయలు సంవత్సరం పాటు ఆర్థిక సాయం చేస్తానని మాటిచ్చారు. ఆర్థిక సాయం ప్రకటించి వారికి మద్దతుగా నిలిచిన జానీ మాస్టర్ కి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జనసేన నాయకులు జానీ బాయ్, షాన్వాస్, ఎస్.కె.పి మస్తాన్, షాజహాన్, ప్రశాంత్ గౌడ్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.