గ్రామ సింహాల గర్జనలకు భయపడేది లేదు

  • కేసులు అరెస్టులతో జనసేన నాయకులను, పవన్ కళ్యాణ్ ని ఆపలేరు.
  • నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు

నూజివీడు, అక్రమ కేసులతో,అరెస్టులతో జనసేనని ఆపలేరని నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు
సైకో-వైసీపీ మంత్రుల మీద విమర్శలు చేశారు. శనివారం విశాఖలో గర్జన పేరుతో విద్యార్ధులను, డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలించి చేసిన ఫేక్ గర్జన తుస్సుమనడంతో వైసీపీ నాయకులు, మంత్రులు విమానాశ్రయానికి జనవాణికి, వివిధ పార్టీ కార్యక్రమాల కోసం పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలకడానికి వేలాది కార్యకర్తలు వేసి ఉన్న సమయంలో వారిని చూసి తట్టుకోలేక మంత్రి జబర్దస్త్ రోజా జనసైనికులను రెచ్చకొట్టడమే కాకుండా వైసీపీ మంత్రులు జోగి రమేష్, బొత్స సత్యనారాయణ, వైవి సుబ్బారెడ్డి తదితరులు ఫేక్ డ్రామాలకు తెరతీశారు. అభిమానులు మంత్రుల మీద దాడి చేశారని కేసులు పెట్టీ, పోలీస్ వారితో దిగ్విజయంగా సాగుతున్న జనసేన ర్యాలీని అడ్డుకుని లేనిపోని ఆంక్షలతో అడుగుగడుగున పవన్ కళ్యాణ్ ని, నాయకులని ఇబ్బందులకు గురి చేశారు. తదనంతరం విశాఖ నోవోటెల్ హోటల్ లో బస చేసిన నాయకులని అర్దరాత్రి సమయంలో అక్రమ అరెస్టులు చేసి, హోటల్ లోపలికి ఎవరిని రాకుండా 144 సెక్షన్ అమలు చేసి అప్రజాస్వామ్య నిబంధనలతో పవన్ కళ్యాణ్ తలపెట్టిన జనవాణికి సామాన్యులను సభకి రాకుండా భయపెట్టడంతో పవన్ కళ్యాణ్ స్వయంగా అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేసినా తిరిగి వారికే నోటీసులు అందచేసి ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారుని, ఇలాంటి పైశాచిక పాలన ఇస్తారనే పాపం ప్రజలు తెలియక మీకు 151 మంది ఎమ్మెల్యేలను 22 మంది ఎంపీలను ఇచ్చింది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్, జనసేన మీద పెట్టే శ్రద్ద మీ శాఖల మీద పేట్టి ప్రజల సమస్యలను తీర్చాలని, లేనిపక్షంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనసైనికులు మిమ్మల్ని రోడ్డు మీద తిరగనివ్వరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముసునూరు మండల ఉపాధ్యక్షుడు బోట్ల నాగేంద్ర, మండల కార్యవర్గ సభ్యులు బజారు శేషు, నాగం అజయ్, స్వామి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.