వైసీపీ విమర్శలను వరుస ప్రశ్నలతో తిప్పికొట్టిన మాడుగుల జనసేన

పాడేరు: జి.మాడుగుల మండలం జనసేన పార్టీ నాయకులు వైసీపీ నాయకుల విమర్శలకి స్పందిస్తూ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు గడప గడప కి ప్రభుత్వం అనుకుంటూ తిరుగుతూ ఎన్ని గిరిజన గ్రామాలు అభివృద్ధి చేశారు..?. మీరు(వైసీపీ నాయకులు) అనుకున్నట్టుగా 40 లక్షల రూపాయలు సాంక్షన్ చేసి పంచాయతీలోని అన్నిగ్రామలకు ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మీరు చెప్పినట్టుగా ఎన్ని పీ.వీ.టి.జి గ్రామాలకు కేంద్రం నుంచి నిధులు విడుదల అయిన వాటి ద్వారా ప్రతి పీ.వీ.టి.జి గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పన మరియు రుణ సదుపాయాల ప్రోత్సాహకాలు వ్యవసాయ ప్రోత్సాహక రుణాలు ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు కార్పోరేట్ స్థాయిలో అభివృధ్ధి చెందయన్నారు అది ఎక్కడ జరిగిందో అక్కడ పాత్రికేయ మిత్రులు, ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు మేము సిద్ధమే.. మీరు సిద్ధమేనా..?. నాణ్యమైన విద్య అందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. అందుకు నిదర్శనమే ఈ ఏడాది 10వ తరగతి ఫలితాలు మీరు కార్పోరేట్ పాఠశాలలు అంటున్నారు. అందులో చదివే గిరిజన విద్యార్థుల మరణాలకి ఎవరు బాధ్యత వహిస్తారు. ఇందులో కూడా మీ అభివృద్ధి బాగానే ఉందని జి.మాడుగుల మండల నాయకులు అన్నారు. ఆర్థికాభివృద్ధి, విద్యాభివృద్ది లక్ష్యంగా ఎంతమంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి కింద ఋణసదుపాయం కల్పించారు. ట్రైకర్ రుణాల కోసం ఎంతమంది నిరుద్యోగుల దగ్గర ఎంత వసూల్ చేశారు. ఈ రోజు నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగ యువతకు తెలుసు మీ ఆర్ధిక అభివృద్ధి ఇదేనా అన్నారు. భాష వాలంటీర్లు వ్యవస్థ రద్దు చేసి మాతృభాష విద్యావ్యవస్థను నాశనం చేసి విద్యావలంటీర్ల పొట్టకొట్టడంలో ప్రభుత్వం తరపున మీ పాత్ర ఏమిటి?. గిరిజన నిరుద్యోగులకు ఆయుపట్టు అయిన జీవో నెం3 రద్దు విషయంలో గిరిజన భావితరాల తరుపున మీ నాయకత్వం అత్యంత పేలవం కాదా..? మీకు మీరే ఆత్మ విమర్శ చేసుకోండి. మెగా డి.ఎస్సీ అన్నారు. అలా మాయమాటలు చెప్పి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులపై ఆర్థిక దోపిడీకి మీ ప్రభుత్వం తెరలేపింది ఆ విషయం మీకూడా తెలుసు దీనిపై మీ ఆలోచన విధానం ఏమిటి? నాలుగేళ్ళు గడుస్తున్నా కేలండర్ మారుతోంది కానీ జాబ్ కేలాండర్ ఎక్కడ?. విద్యాభివృద్ది అంటున్నారు బోధించే ఉపాధ్యాయులు లేకుండా ఎలా విద్యాభివృద్ది జరుగుతోంది. నూతన ఉపాధ్యాయ నియామకాలు ఎక్కడ? గిరిజన నిరుద్యోగుల ఉపాధి అవకాశాలు కల్పించకపోగా ఇప్పుడు గిరిజన జాతి అస్తిత్వానికి ముప్పు తెచ్చే ప్రకటనలు, తీర్మానాలు ప్రభుత్వం చేస్తుంటే ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న మీరు గిరిజన ప్రజలకు సమాధానం చెప్పకుండా సమస్యలపై పోరాడి ప్రభుత్వానికి తెలియజేసే పనిలో ఉన్న జనసేన పార్టీ నాయకులు, ఇన్చార్జ్ గంగులయ్య గారిపై మీ అర్థం పర్థం లేని విమర్శలు ఎందుకు?. వాస్తవానికి 2023 మార్చి 24వ తేదీన గిరిజన ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం, పార్టీ ఆ రోజే సమాధి కాబడింది కేవలం జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం కోసం గిరిజన ప్రజల్ని ఏమార్చి తప్పుదోవ పట్టిస్తారా?.. గిరిజన ప్రజలు అంత ఈజీగా నమ్మేస్తారని అనుకుంటున్నారా? ప్రభుత్వంతో మీరు చేసుకున్న లోపాయకారి ఒప్పందాలు ప్రజలకు తెలియకుండా అసెంబ్లీలో మౌనవ్రతం పాటించి గిరిజన ద్రోహులుగా ఎందుకు అంతకు తెగించారు. ఇది కంచె చేను మేయడం వంటి విద్రోహపు చర్య కాదా?.. మీరు జాతికి ద్రోహులు కారా?.. అసలు జాతి ప్రయోజనం కోసం మీరు చేస్తున్న పోరాటాలు ఏమిటి?. జాతి ప్రయోజనం కోసం మీరు ఏ త్యాగం చేస్తున్నారు?. గ్రామ పంచాయితీ ప్రధమ పౌరుడైన చర్పంచ్ అధికారులకు తూట్లు పొడిచి నేటికి పంచాయితి గ్రామాభివృద్ధి పంచాయితి వ్యవస్థని నిర్వీర్యం చేయడంలో మీరు కూడా ప్రభుత్వం తరపున పాత్రధారులు కాదా..? లేక ప్రభుత్వం ఏమిచేసిన మాకు ఇష్టమేనని బానిసత్వం ప్రకటించుకున్నారా?. ఇవాళ ప్రభుత్వం సర్పంచ్ లకు ప్రజల ముందు తలా ఎత్తుకోలేని పరిస్థితులు మీ ప్రభుత్వం చెయ్యలేదా..?. ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచ్ లను మీరు చూడలేదా..? అంటూ జనసేన తరఫున జనసేన నాయకులు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జి.మాడుగుల మండల నాయకులు పాత్రికేయమిత్రుల సమావేశంలో జనసేన పార్టీ లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, మండల అధ్యక్షులు, మసాడి భీమన్న, ప్రదనవకార్యదర్శి గొంది మురళి, తల్లే త్రిమూర్తి, భానుప్రసాద్, రమేష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.