ఆర్ కే వి బి పేట పంచాయితీ అభివృద్ధిలో సర్పంచ్ పాత్ర లేదా?

  • పంచాయితీ ఆదాయ వనరుల పెంపొందించడంలో కార్యదర్శికి బాధ్యత లేదా?
  • పంచాయతీ పర్యవేక్షణలో ఈవో పి ఆర్ అండ్ ఆర్ డి ప్రేక్షక పాత్రేనా?
  • ఒక్క గ్రామ పంచాయతీని కూడా అభివృద్ధి చేయలేని ఉప ముఖ్యమంత్రి ఎందుకు?
  • ప్రధాన బాధ్యత వహిస్తున్న ఎంపీడీవోను సస్పెండ్ చేయాలి
  • జనసేన ఇంచార్జ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డా.యుగంధర్ పొన్న

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో, కార్వేటి నగర్ మండల కేంద్రంలోని పార్టీ ఆఫీసులో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జి మరి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ ఆర్ కే వి బి పేట పంచాయితీ అభివృద్ధిలో సర్పంచ్ పాత్ర లేదా? అని ప్రశ్నించారు. తుమ్మలచెరువు వేలం పాటలో పాడిన రూపాయలను ఇంతవరకు రాబట్టలేని వారికి పదవులు ఎందుకని తీవ్రంగా విమర్శించారు. గ్రామ పంచాయితీ ఆదాయ వనరుల పెంపొందించడంలో కార్యదర్శికి బాధ్యత లేదా? అని దుయ్యబట్టారు. మూడు సంవత్సరాలు కావస్తున్నా పంచాయితీ వనరులకు గండి కొడుతున్న పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మండలంలోని అన్ని పంచాయతీలను పర్యవేక్షణ చేసే ఈవో పి ఆర్ అండ్ ఆర్ డి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది అన్ని పదవులు అనుభవించి చివరికి ఒక్క గ్రామ పంచాయతీని కూడా అభివృద్ధి చేయలేని ఉప ముఖ్యమంత్రి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి ఎందుకని, ఈసారి ప్రజలందరూ ఇంటికి పరిమితం చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే మండలానికి ప్రధాన బాధ్యత వహిస్తున్న ఎంపీడీవో పంచాయతీ అభివృద్ధికి దోహద పడలేదు, మూడు సంవత్సరాలు పంచాయతీకి రావలసినటువంటి ఆదాయానికి పరోక్షంగా గండి కొట్టారని, అందువల్ల సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, కార్వేటి నగర్ మండల ఉపాధ్యక్షురాలు సెల్వి, వెదురుకుప్ప మండల యువజన అధ్యక్షులు సతీష్, టౌన్ కమిటీ ప్రధాన కార్యదర్శి శివప్రసాద్, నియోజకవర్గ ఇన్చార్జి సతీమణి స్రవంతి రెడ్డి, కుమార్తె కిరణ్మయి పొన్న తదితరులు పాల్గొన్నారు.