పంచాయతీ నిధుల మల్లింపు అమానుషం: పెంటేల బాలాజి

  • నరసరావుపేటలో పంచాయతీ నిధుల మల్లింపులను నిరసిస్తూ బిజెపి, జనసేనల మహా ధర్నా

చిలకలూరిపేట నియోజకవర్గం: రాష్ట్ర వ్యాప్తంగా 12090 పంచాయతీలు 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 37 నగరపాలకలు ఉన్నాయి, పంచాయతీలు అన్ని కూడా స్థానిక స్వపరిపాలన మీద ఉన్నాయి. పంచాయతీలలో ఉన్న సమస్యలు చిన్న చిన్నవి, అవి ఎమ్ ఎల్ ఏ, ఎం.పి స్థాయిలో నెగ్లెట్ అవుతాయి కాబట్టి పంచాయతీ సర్పంచులను నియమించి ఆయా గ్రామాలలో వచ్చినటువంటి పన్నుల రూపంలో ఆ గ్రామాలలో ఉన్నటువంటి ఇసుక రీచ్ లేదా మైనింగ్ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం సర్పంచుల ద్వారా ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయాలి. సర్పంచులకు ఆస్తి ధ్రువపత్రాలు, వివాహ ధ్రువ పత్రాలు, బాధలాయింపు ధ్రువపత్రాలు, మంచి నీటి కుళాయిలుఇప్పించడం, పరిశ్రమలు స్థాపిస్తే వాటికి ధ్రువపత్రం, భవన నిర్మాణ అనుమతులు, జనన మరణం ధ్రువీకరణలు అందిచడం లాంటివి ఉన్నాయని, మన రాష్ట్రంలో సర్పంచులకు అధికారాలు ఉన్నాయని తెలియకుండా ఇవన్నీ వైస్సార్సీపీ ప్రభుత్వం ఎమ్ ఎల్ ఏ కనుసన్నల్లో వాలంటీర్లు ఇస్తున్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని బాలాజి ప్రశ్నించారు. గ్రామాల్లో వచ్చే పన్నులు రైజ్ చేసుకువచ్చు, రాష్ట్ర ప్రభుత్వంనకు మైనింగ్ సెజ్ అని చాలా సంపద గ్రామాల అభివృద్ధికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, కేంద్ర ప్రభుత్వం గ్రామ అభివృద్ధి కోసం వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక లోకల్ బాడీ నిధులు 6600 కోట్లు, స్వచ్ భారత్ నిధులు 1200 కోట్లు ప్రతి సంవత్సరం, ఎన్ఆర్ఈజి నిధులు 9000కోట్లు నిధులు, అలానే అనేక గ్రాంట్లు కూడా ఇచ్చాయి ఇవన్నీ కేవలం పంచాయతీలకు 15% మాత్రమే ఖర్చు చేసాయి. మిగతా డబ్బులు సర్పంచులకు కూడా తెలియకుండా వైస్సార్సీపీ ప్రభుత్వం మళ్ళించడం అమానుషం. రాజ్యాంగ ఉల్లంఘనచేయడమే, జవాబుదారి లేని ఈ ప్రభుత్వంపై నిరసిస్తూ జనసేన మరియు బీజేపీ ఉమ్మడిగా నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో నిరసన తెలియచేసి పల్నాడు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గం జనసేన నాయకులు పెంటేల బాలాజి, యడ్లపాడు మండల ఉపాధ్యక్షులు మల్లా కోటి, యడ్లపాడు మండల కార్యదర్శి బొందలపాటి సుబ్బారావు, చిలకలూరిపేట మండలం నాయకులు తిమ్మిశెట్టి కోటేశ్వరరావు, పట్టణ నాయకులు పగడాల వెంకటేశ్వర్లు, ముద్దా యోబు, తోటకూర అనిల్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.