గురజాల జనసేన ఆధ్వర్యంలో మహానిరసన

గురజాల, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ, గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురజాల పట్టణంలోని బ్రహ్మనాయుడు కూడలి వద్ద శనివారం మహానిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కటికం అంకారావు మాట్లాడుతూ, జాతిపిత మహాత్మాగాంధీ అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగినప్పుడే, మన దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అని ఆయన చెప్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అర్ధరాత్రి కాదు కదా, పట్టపగలు కూడా, చిన్నారులు సైతం తిరగలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన ఎద్దేవా చేశారు. మహిళా హోంమంత్రి ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలి కానీ తల్లిదండ్రుల పెంపకం వల్ల, రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నాయనడం దౌర్భాగ్యమైన చర్య అని, ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలకు, బేషరతుగా హోంమంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలన్నా, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలన్న, జనసేన పార్టీతోనే సాధ్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబటి మళ్లీ, దూదేకుల ఖాసీం సైదా, పసుమర్తి మని, దూదేకుల శ్రీను, వేల్పుల చైతన్య, గురుశాల ప్రసాద్ చింతకాయల కళ్యాణ్ కామిశెట్టి రమేష్, మందపాటి దుర్గారావు, బడిదెల శ్రీనివాసరావు, ఉప్పిడి నరసింహారావుతో పాటుగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.